DK Aruna Batting: బ్యాట్ పట్టిన డీకే అరుణ.. సందడే సందడి!

1 year ago 39
మహబూబ్‌నగర్ బాయ్స్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన 'అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి' ఆధ్వర్యంలోని 'అయ్యప్ప ప్రీమియర్ లీగ్' క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. గత నాలుగు రోజులుగా 32 జట్ల మధ్య జరిగిన ఈ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. ఎంపీ డీకే అరుణ ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, నిర్వాహకులను అభినందించారు. ఈ వేడుకలో ఆమె స్వయంగా బ్యాట్ పట్టి, గ్రౌండ్‌లో కాసేపు క్రికెట్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. ఎంపీ డీకే అరుణ బ్యాటింగ్ ఈ టోర్నమెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత సందడి తీసుకొచ్చారు.
Read Entire Article