కొడంగల్‌ను భారీ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే తన కల అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 943.34 ఎకరాల్లో రేర్ ఇండస్ట్రియల్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొడంగల్‌కు రేడియల్ రోడ్డును 2027 డిసెంబరుకు పూర్తి చేసి ప్రయాణ సమయాన్ని 70 నిమిషాలకు తగ్గించనున్నట్లు ప్రకటించారు. మరో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.