60 ఏళ్ల తర్వాత కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం.. ఈనెల 16 నుంచి అరుదైన చందనోత్సవం

2 days ago 5
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సుమారు 60 ఏళ్ల తర్వాత చందనోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సమయంలో మూలవిరాట్ దర్శనాన్ని నిలిపివేసి, ఉత్సవమూర్తి దర్శనానికి అవకాశం కల్పిస్తారు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 20 వరకు భక్తులు అంజన్న నిజరూపాన్ని దర్శించుకోవచ్చు. రోజుకు 50 వేల మంది చొప్పున సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు.
Read Entire Article