రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై అభ్యర్థుల చేస్తున్న ఆందోళనలకు బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. డీజీపీ స్వయంగా 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించినప్పటికీ.. కేవలం 5,000 పోస్టులకే నోటిఫికేషన్ పరిమితం చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. వయోపరిమితి కుదింపు, ఈవెంట్లలో తెచ్చిన కఠినమైన మార్పుల వల్ల గ్రామీణ యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ.. ప్రభుత్వంపై ఆయన సంధించిన విమర్శనాస్త్రాల పూర్తి వివరాలు మీకోసం.