హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. ఈ ఏరియాల్లో కుండపోత.. అధికారులు హెచ్చరికలు జారీ..

11 months ago 24
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సాయంత్రం వేళల్లో మొదలైన వాన రాత్రికి తీవ్రమైంది. కుత్బుల్లాపూర్, మేడ్చల్, మియాపూర్ సహా పలు ప్రాంతాలలో కుండపోత వర్షం పడుతోంది. కొన్ని నిమిషాలకే రహదారులు జలమయమయ్యాయి. వాతావరణ కేంద్రం రాబోయే గంటల్లో భారీ వర్షాలుంటాయని హెచ్చరించింది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని, వాహనదారులు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Read Entire Article