రూ.500 నోట్లు రద్దు చేయాలి, డిజిటల్ కరెన్సీపై చంద్రబాబు ప్రతిపాదన.. గతంలోనూ ఇదే డిమాండ్!

18 hours ago 1
దేశంలో అవినీతిని అరికట్టేందుకు రూ.500 నోట్లను రద్దు చేసి.. రూ.100, రూ.200 నోట్లు మాత్రమే కొనసాగించాలని సీఎం చంద్రబాబు మరోసారి ప్రతిపాదించారు. డిజిటల్ కరెన్సీ, ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించాలని ప్రధాని మోదీని కోరుతూనే ఉంటానని తెలిపారు. పెద్ద నోట్లపై ఆయనకు ఈ అభిప్రాయం కొత్తది కాదు. 2017లోనే రూ.500, రూ.2,000 నోట్ల అవసరాన్ని ప్రశ్నించారు. 2025లోనూ డిజిటల్ కరెన్సీపై తాను ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ పెద్ద నోట్ల ముద్రణ నిలిపివేయాలని సూచించారు. 2023లో ఆర్బీఐ రూ.2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న నిర్ణయాన్ని కూడా చంద్రబాబు స్వాగతించారు.
Read Entire Article