కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని భావించిన హైకోర్టు.. రంగారెడ్డి కలెక్టర్‌కి జైలు శిక్ష విధించింది. నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కొన్ని భూములను తొలగించాలన్న బాధితుల వినతిపై 60 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించినా కలెక్టర్ స్పందించలేదు. దీంతో బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాతే అధికారులు వినతిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల వివరణలోనూ రికార్డులకు పొంతనలేని అంశాలను గుర్తించిన ధర్మాసనం.. కోర్టు ఆదేశాలను ప్రశ్నించకుండా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది.