హైదరాబాద్ మెట్రో స్టేషన్ కింద ఫుట్‌పాత్‌పై స్టాళ్లను ఏర్పాటు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాదచారులు నడిచే ప్రాంతాలను.. దుకాణాలకు లీజుకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలు నడిచే చోట బిజినెస్ చేయడం వల్ల వాళ్లకు ఇబ్బంది కలుగుతుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ స్టాళ్ల విషయంలో తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించింది.