హైదరాబాద్ పాతబస్తీలోని సైదాబాద్ పరిధిలో ఉన్న ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో మతపరమైన అంశం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇక్కడ పని చేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి ఇస్లామిక్ సాంప్రదాయ ప్రార్థనలను హోమ్‌వర్క్‌గా ఇచ్చి వివాదానికి తెరలేపారు. సదరు బాలుడి హోమ్‌వర్క్ డైరీలో కూడా ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా రాయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహంతో పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని, సదరు ఉపాధ్యాయురాలిని నిలదీశారు.