లక్డీకాపూల్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు కొత్త వన్‌వే విధానాన్ని ప్రతిపాదించారు. రవీంద్రభారతి, లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్ జంక్షన్ల మధ్య ఈనెల 22న ఒకరోజు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ విధానంలో ఓల్డ్ కంట్రోల్ రూమ్, నిరంకారి జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. వీసీ సజ్జనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బైక్‌పై పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక వ్యాపారులు, నివాసితుల అభిప్రాయాలను సేకరించిన తర్వాత ట్రయల్ రన్ నిర్వహిస్తారు. వాహనాల వేగం, ప్రయాణ సమయం, రద్దీ, భద్రతపై సేకరించిన డేటాను విశ్లేషించి వన్‌వేను శాశ్వతంగా అమలు చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు.