సూర్యాపేటలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. సూపర్ మార్కెట్ ధ్వంసం, భారీగా ఆస్తి నష్టం

2 weeks ago 7
సూర్యాపేట పట్టణంలో దసరా పండుగ వేళ భారీ పేలుడు సంభవించింది. పీఎస్‌ఎస్ఆర్ సెంటర్ సమీపంలోని శ్రీసాయి సూపర్ మార్కెట్‌లో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం తీవ్రంగా ధ్వంసమైంది. గ్యాస్ లీకేజీ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పేలుడు శబ్దంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సూపర్ మార్కెట్ నిర్వాహకులు భారీ ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
Read Entire Article