సుధీర్ రెడ్డి జాగ్రత్త.. సైలెంట్‌గా ఉన్నామంటే చేతగానితనం కాదు.. జనసేన కోట వినుత

3 months ago 18
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య మరోసారి విభేదాలు వెలుగుచూశాయి. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి.. జనసేన నాయకురాలు కోట వినుత వార్నింగ్ ఇచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీని తొక్కేయాలనే కుట్ర జరుగుతోందని కోట వినుత ఆరోపించారు. జనసేన కార్యకర్త శివకుమార్‌కు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంటిని హడావిడిగా అర్ధరాత్రి సమయంలో కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అక్రమ కట్టడమైతే నోటీసులు ఇచ్చి అధికారికంగా చేపట్టాలి కానీ.. కక్షపూరితంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. సైలెంట్‌గా ఉన్నామంటే చేతగాని వాళ్లం కాదంటూ హెచ్చరించారు.
Read Entire Article