సింగరేణి సంస్థకు కేంద్రం శుభవార్త చెప్పింది. బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయి ఇబ్బందుల్లో ఉన్న ఆ సంస్థకు బొగ్గు సరఫరా కోసం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆర్‌జీ కోల్‌మైన్ పేరుతో సరికొత్త ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చింది. రూ.2 వేల కోట్లకుపైగా పెట్టుబడులతో 5 కొత్త బొగ్గు గనులను తవ్వనున్నారు. ఈ 5 గనుల ద్వారా ఏటా 2.10 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుతో బొగ్గు ఉత్పత్తి పెరిగి సింగరేణికి కొత్త ఊపిరి రానుంది.