హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ (AINU) ఆసుపత్రి వైద్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనాలోని వూహాన్ నగరంలో ఉన్న ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సయ్యద్ ఎండ్ గౌస్.. సుమారు 3900 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ బంజారాహిల్స్ ఏఐఎన్‌యూ ఆసుపత్రిలోని 57 ఏళ్ల మహిళా రోగికి 5జీ నెట్‌వర్క్ ఆధారిత రోబో సహాయంతో విజయవంతంగా మూత్రనాళ శస్త్రచికిత్స చేశారు. కేవలం 90 నిమిషాల్లో ముగిసిన ఈ టెలిసర్జరీ వైద్యరంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది.