Visakhapatnam 31st CII Partnership Summit 2026: విశాఖపట్నంలో సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎ: పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సదస్సు ప్రారంభానికి ముందు ప్రదర్శన స్టాళ్లను సందర్శించి, వివిధ కళాకృతులు, ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. గురు, శుక్రవారాల్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 141 ఎంవోయూలతో రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయంటున్నారు.