తెలంగాణలో గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ పొందుతున్న 54.79 లక్షల కనెక్షన్లకు ట్రూఅప్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. గతంలో విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటినా.. ప్రస్తుతం పథకం అర్హత ఉంటే ఈ మినహాయింపు వర్తిస్తుంది. దీంతో లబ్ధిదారులకు జీరో బిల్లులు కొనసాగనున్నాయి. ఈ నిర్ణయం వల్ల వచ్చే రెండేళ్లలో ప్రభుత్వంపై సుమారు రూ.500 కోట్ల అదనపు భారం పడనుంది.