Nidamanuru Double Decker Flyover In Vijayawada: విజయవాడలోని నిడమానూరు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణంపై అప్డేట్ వచ్చింది. మోర్త్ సెక్రటరీకి ఏపీ ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీ లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సమయంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఈ ఫ్లై ఓవర్ గురించి వివరించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఫ్లై ఓవర్ ఆవశ్యకతను వివరించారు.. ఆయన సానుకూలంగా స్పందించారు.