నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. ఇక జిల్లాలోనే ఐటీ కొలువులు.. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేదు..!

3 hours ago 1
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రూ.54 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నాలుగేళ్ల నిర్మాణ ప్రస్థానం తర్వాత బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రి శ్రీధర్‌బాబు భవనాన్ని ప్రారంభించనున్నారు. 75 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులతో నిర్మించిన ఈ టవర్‌లో ఐటీ సంస్థలకు అవసరమైన వసతులు కల్పించారు. మరిన్ని కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తే ఉద్యోగాల కోసం ఇతర నగరాలకు వెళ్లే స్థానిక యువతకు జిల్లాలోనే ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
Read Entire Article