కొత్త రేషన్ కార్డుల విభజన, కుటుంబసభ్యుల పేర్లు చేర్పు, తొలగింపు ఇకపై మరింత సులభతరం కానుంది. ఏపీ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రోజున ఆర్టీజీఎస్‌పై సమీక్షా సమావేశం నిర్వహించిన నారా లోకేష్.. అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే డేటా లేక్ పనులను జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.