రేవంత్ రెడ్డి కోసం 9 రోజులు, 350 కి.మీ.లు నడక.. జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన కర్నూలు అభిమాని

2 hours ago 1
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఏపీకి చెందిన తాయన్న వినూత్న ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రిని కలవాలన్న కోరికతో ఆదోని నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 350 కిలోమీటర్ల దూరాన్ని 9 రోజుల పాటు కాలినడకన ప్రయాణించి చేరుకున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. తనను కలవడానికి ఇంత దూరం నడిచి వచ్చిన అభిమానిని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి అభినందించారు.
Read Entire Article