బియ్యం ధరలు ఫిక్స్.. కనిష్ఠంగా కిలో రూ.66, గరిష్ఠంగా రూ.79.. ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్‌!

1 hour ago 2
తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. కనిష్ఠంగా కిలో బియ్యం రూ.66.. గరిష్ఠంగా రూ.79 ధరలు నిర్ణయించింది. 26 కిలోల బియ్యం బస్తాలపై ఈ ధరలను స్పష్టంగా ముద్రించాలని ఆదేశించింది. ఇటీవల వారం రోజులుగా 2,686 తనిఖీలు నిర్వహించిన అధికారులు.. 335 కేసులు నమోదు చేశారు. తక్కువ బరువును ఎక్కువగా చూపించడం, ధరల స్టిక్కర్లతో మోసాలకు పాల్పడటం, పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం వంటి ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలు పదేపదే ఉల్లంఘించే వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించే యోచనలో అధికారులు ఉన్నారు.
Read Entire Article