యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప సమీపంలో ప్రతిపాదించిన బొగ్గు గని ప్రాజెక్టుపై ఎన్జీటీ సుమోటోగా కేసు నమోదు చేసింది. సింగరేణి ప్రతిపాదన ప్రకారం చెరువుకు సుమారు 300 మీటర్ల దూరంలో తవ్వకాలు జరిగే అవకాశం ఉందన్న వార్తలతో పర్యావరణ, వారసత్వ పరిరక్షణపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆలయానికి ఉన్న 800 ఏళ్ల చరిత్ర, ఇసుక ఆధారిత పునాది, భూగర్భ జలాలపై తవ్వకాల ప్రభావం వంటి అంశాలను ఎన్జీటీ పరిగణనలోకి తీసుకుంది. 5 ప్రభుత్వ సంస్థలకు నోటీసులు జారీ చేసి అఫిడవిట్లు కోరింది. కేసును చెన్నైలోని బెంచ్‌కు బదిలీ చేయగా.. తదుపరి విచారణ డిసెంబర్ 21న జరగనుంది.