4 ఏళ్ల క్రితం కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ నాటిన మియాజాకి మామిడి చెట్లు కాయలు కాశాయి. దీంతో ఆమె తాజాగా ఆ మామిడి పళ్లను కోశారు. అయితే ఈ మియాజాకి మామిడి పళ్లు కిలో రూ.2.5 లక్షలు పలుకుతాయని ఆమె వెల్లడించారు. కేరళ నుంచి మొక్కలు తెప్పించి.. ఈ మియాజాకి మామిడి చెట్లను పెంచినట్లు తెలిపారు. మొదట ఆ మొక్కలు బతుకుతాయా అని అనిపించిందని.. కానీ ఇప్పుడు సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.