మంత్రి లోకేశ్, స్పీకర్ అయ్యన్నపై పోలీసులకు అంబటి రాంబాబు ఫిర్యాదు

1 year ago 24
మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ సోషల్‌ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ పోలీసులకు మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఆ పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వైఎస్‌ జగన్‌పై లోకేశ్ చేసిన అసభ్యకర ట్వీట్లపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ఈ సందర్భంగా అంబటి ప్రశ్నించారు. లోకేశ్ ట్వీట్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ శ్రేణులు పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశామని, గతంలో వైఎస్‌ జగన్‌పై అయ్యన్న పాత్రుడు అసభ్యకరమైన కామెంట్స్‌ చేయలేదా?.ఆయనపై కూడా మేం ఫిర్యాదు చేశాం. చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీసీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని, ఏపీలో అరాచక పాలన నడుస్తోందని ఆరోపించారు.
Read Entire Article