వరంగల్ జిల్లా పాకాల సరస్సులో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భర్తతో కొంతకాలంగా జరుగుతున్న గొడవల నేపథ్యంలో ఆమె తన పిల్లలతో కలిసి ఈ బలవన్మరణానికి పాల్పడిందని చెబుతున్నారు. భర్త మరో మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆరోపణలతో తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. గతంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినట్లు కూడా సమాచారం. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.