విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి ఎదురు దెబ్బ తగిలింది. బొండపల్లి స్థానంలో జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష ఓటమి పాలయ్యారు. కానీ అదే స్థానంలో టీడీపీ నుంచి పోటీ చేసిన పాశల నీరజ ఘన విజయం సాధించారు. ఏకంగా 5 వేల 136 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి పాశల నీరజ గెలుపుతో బొండపల్లిలో కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేసుకుంటున్నాయి.