బీరు బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. వైన్స్‌లో బీరు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి.. తీసుకెళ్లి దాన్ని తాగే క్రమంలో అందులో కండోమ్ ఉన్నట్లు కనిపించింది. ఒక్కసారిగా అవాక్కైన ఆ వ్యక్తి.. తిరిగి వైన్స్ వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. వైన్స్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోవడంతో.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ వ్యక్తి.. అక్కడే ఆందోళనకు దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.