తెలంగాణపై చలి పంజా.. 3 రోజులు మరిన్ని చలిగాలుల హెచ్చరికలు.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

8 hours ago 1
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రానున్న 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ 29 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో 12 డిగ్రీలకు కూడా పడిపోవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే ఆదిలాబాద్‌లో 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోనూ చలి పెరుగుతోంది.
Read Entire Article