Andhra Pradesh High Temperatures And Rains: ఏపీలో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఇవాళ చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అంతేకాదు మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా వానలు పడతాయంటున్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండలు, వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది.