బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుండడంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో బలపడుతుండడం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ముప్పు ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా ఆందోళన వ్యక్తం చేశారు.