Tirumala Illegal TTD Rooms Booking With Fake Aadhaar Cards: తిరుమలలో మరో సరికొత్త మోసం బయటపడింది. నలుగురు కలిసి కొండపై వసతి గదులకు సంబంధించి పెద్ద స్కామ్ చేస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి వాటితో గదుల్ని పొందుతున్నారు. ఆ గదుల్ని భక్తులకు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో నలుగురిని తిరుమలలోని సీఆర్వో కార్యాలయం దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు.