ప్రభాస్ ఎవరో నాకు తెలియదు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

1 year ago 31
నటుడు ప్రభాస్ గురించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ తన స్వప్రయోజనాల కోసం చెల్లి, తల్లి పేర్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు. నా బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నానని, ప్రభాస్‌ ఎవరో నాకు ఇప్పటికీ తెలియదన్నారు. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. జగన్‌కు ఇవ్వన్నీ తెలిసి కూడా, నాకు వ్యక్తిత్వం లేనట్లు ప్రచారం చేయించారని మండిపడ్డారు. ప్రభాస్‌తో సంబంధం ఉన్నట్లు గత ఐదేళ్లుగా జగన్‌ తన సైతాన్‌ సైన్యంతో సోషల్‌ మీడియాలో నాపై విమర్శలు చేయించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మీకు చెల్లెలిపై ప్రేమ ఉందా? అసలు మీకు సిగ్గు ఉందా? మళ్లీ నా వీడియోనే ప్లే చేసి, మీకు మైలేజీ వచ్చేటట్లు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article