ఇక నుంచి ప్రతీ జిల్లాలో అరకు కాఫీలు లభించనున్నాయి. జిల్లాకు 2 దుకాణాల చొప్పున ఫ్రాంఛైజీలు ఇవ్వనున్నారు. మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెప్మా, నేటివ్ అరకు కాఫీ సంస్థ మధ్య తాజాగా కీలక ఒప్పందం కుదిరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ అరకు కాఫీ ఔట్‌లెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ అరకు కాఫీ ఔట్‌లెట్లు ఏర్పాటు చేసుకునే మహిళలకు లోన్లు, సబ్సిడీలు అందించనున్నారు.