Supreme Court Dismissed Pastor Chintada Anand Petition: మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందన్న అంశంపై సుప్రీం కోర్టులో మరోసారి విచారణ జరిగింది. మార్చిలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని పాస్టర్ చింతాడ ఆనంద్ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. తీర్పు విషయంలో లోపాలు లేవని తేల్చి చెప్పింది. దీంతో గతంలో ఇచ్చిన తీర్పు అమల్లోకి వస్తుంది.