Andhra Pradesh Pastor Anand Sc Certificate Cancelled: బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ గెజిట్ విడుదల చేశారు. జిల్లాస్థాయి స్క్రూటినీ కమిటీ సిఫారసుల్ని పరిశీలించి ఎస్సీ హోదా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని గెజిట్‌లో తెలిపారు. ప్రభుత్వం ముందు అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు.