‘నేను ఫేక్ అనుకున్నా కానీ నిజంగానే రూ.1000 వచ్చాయి’.. దీపావళి గిఫ్ట్‌పై సీపీ సజ్జనార్ అలర్ట్

3 days ago 6
దీపావళి సందర్భంగా పేటీఎం పేరుతో రూ.1,000 నగదు కానుక ఇస్తున్నారంటూ వాట్సాప్‌లో వైరల్ అవుతున్న సందేశం నకిలీదని సీపీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. ‘నాకు డబ్బులు వచ్చాయి.. మీరు కూడా ప్రయత్నించండి’ అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తూ సైబర్ నేరగాళ్లు అనుమానాస్పద వెబ్‌సైట్ లింకులను పంపిస్తున్నారు. వీటిని క్లిక్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు చోరీ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల అపరిచిత లింకులను తెరవకూడదని, యూపీఐ పిన్, ఓటీపీ వంటి వివరాలను ఎవరికీ చెప్పకూడదని సూచించారు. మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు.
Read Entire Article