నాటుకోడి కూర వండటంలో తలెత్తిన వివాదం కాస్తా ఆ కుటుంబంలో ఒకరిని బలి తీసుకుంది. నాటు కోడి వండాలని భర్త భార్యకు చెప్పగా.. తర్వాత వండుదామని ఆమె చెప్పడంతో గొడవ మొదలైంది. ఈ గొడవ కాస్తా చిలికి చిలికి గాలివాన లాగా పెద్దది అయింది. దీంతో వారిద్దరి మధ్య గొడవను ఆపేందుకు వెళ్లిన కుమారుడు.. చివరికి రోకలిబండతో తండ్రిని కొట్టడంతో.. అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.