TDP Appointed Regional Coordinators For Lok Sabha: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కొత్తగా కమిటీలను నియమించిన చంద్రబాబు లోక్‌సభ స్థానాలకు ప్రాంతీయ సమన్వయకర్తల్ని నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా 10మందికి ఈ లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటుగా పార్టీలో సీనియర్ నేతల్ని ఈ పదవుల్లో నియమించారు. వీరు ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీకి సంబంధించి సమన్వయ బాధ్యతలు అప్పగించారు.