దేశవ్యాప్తంగా బుధవారం మెడికల్ షాపులు మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా ఫార్మసీలు సమ్మె చేస్తున్న నేపథ్యంలో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే దేశం మొత్తం రేపు 12.40 లక్షలకు పైగా మెడికల్ దుకాణాలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను మూసివేయనున్నారు. ఆన్‌లైన్‌లో మందుల సరఫరాకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్తంగా ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒక్క హైదరాబాద్‌లోనే 16 వేలకుపైగా మెడికల్ షాప్‌లు బంద్ కానున్నాయి.