తెలంగాణలో తొలి ప్రైవేటు సమీకృత ఆయిల్‌పామ్ పరిశ్రమ ఖమ్మం జిల్లా అంజనాపురంలో ఈ నెల 20న ప్రారంభం కానుంది. గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ రూ.300 కోట్ల పెట్టుబడితో 113.5 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి ఉపాధి లభించనుంది. మలేసియా భాగస్వామ్యంతో దేశంలోనే తలమానికంగా నిలిచే సీడ్ గార్డెన్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మరో ఆరు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.