టీమిండియా క్రికెటర్, డీఎస్పీ మహ్మద్ సిరాజ్ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీస్ యూనిఫామ్‌లో వచ్చిన సిరాజ్.. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీవీ ఆనంద్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను సిరాజ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి. దీంతో డీఎస్పీ సిరాజ్ ఆన్ డ్యూటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.