తెలంగాణలో 7,448 కి.మీ. హ్యామ్‌ రోడ్లు..పల్లెల రూపురేఖలు మార్చనున్న రహదారులు

3 weeks ago 12
Seethakka On HAM Roads: తెలంగాణలో 7,448 కిలోమీటర్ల హ్యామ్‌ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నిర్మాణ సంస్థలు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా నిరంతర తనిఖీలు చేపట్టాలని సూచించారు. మహిళా శక్తి, అంగన్‌వాడీ భవనాలను నవంబరు 19 నాటికి పూర్తి చేయాలని, పనులు ప్రారంభించని చోట నిబంధనల ప్రకారం రద్దు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా, గ్రామీణ రహదారుల అభివృద్ధితో రైతులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు విద్య, వైద్యం, వ్యాపారాలు, ఉపాధి అవకాశాలకు ఊతం లభించనుంది.
Read Entire Article