Pawan Kalyan Thanks To CM Revanth Reddy: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాను హనుమకొండ పర్యటనకు వెళ్లిన సమయంలో సహాయ సహకారాలు అందించారని ట్వీట్ చేాశారు. అలాగే తెలంగాణ పోలీసు శాఖకు, అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలు తనపై చూపించిన ప్రేమ, మమకారాన్ని మర్చిపోలేనన్నారు. తన అభిమాని నిరంజన్‌ను హనుమకొండలో పరామర్శించిన తర్వాత ట్వీట్ చేశారు.