హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడిపారు ప్రధాని. ఈ సందర్భంగానే నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్‌తో మోదీ ముచ్చటించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నారా దేవాన్ష్ అచ్చుగుద్దినట్లు తాత బాలకృష్ణ లాగే ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాతమ్మ కల సినిమాలో బాలకృష్ణ లాగే.. నారా దేవాన్ష్ ఉన్నాడంటూ ఫోటోలు వైరల్ చేస్తున్నారు.