సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దంపతుల మధ్య గొడవ 18 రోజుల పసికందు ప్రాణం తీసింది. ఈ దారుణం జోగిపేటలో చోటుచేసుకుంది. జోగిపేటకు చెందిన పోతురాజు కృష్ణ, గౌరమ్మలు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత.. వీరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే శనివారం మరోసారి గొడవ జరగ్గా.. కోపంలో కృష్ణ 18 రోజుల పసికందును నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మగ శిశువు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.