బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. బహదూర్‌గూడ భూముల వివాదంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 28 ఎకరాల భూమి తమదేనంటూ నలుగురు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. ప్రభుత్వం భూములు తమవేనని వాదించగా.. 30 ఏళ్లుగా ఆ భూములను సాగు చేస్తున్నామని రైతులు పేర్కొన్నారు.