జూలై 8 వరకు దంచికొట్టనున్న వానలు.. తెలంగాణని ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్

3 weeks ago 3
తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. జూలై 8 వరకు ఏడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం వంటి ఉత్తర, తూర్పు జిల్లాల్లో తొలి రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో వానలు పడతాయని అన్నారు. ఈ మేరకు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read Entire Article