జాగ్రత్త.. బంగాళాఖాతంలో అల్పపీడనం.! మళ్లీ వర్షాలే వర్షాలు..ఎప్పటి నుంచి అంటే?

9 months ago 20
ఏపీవాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. బుధవారం నుంచి భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం మంగళవారం నాటికి అల్పపీడనంగా మారుతుందని.. గురువారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీంతో బుధవారం నుంచి ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. పిడుగులు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Read Entire Article