ఆంధ్రప్రదేశ్‌లో కోడి గుడ్డు ధర సామాన్యుడిపై గుదిబండలా మారింది. కోళ్ల ఫారాల వద్దే ఒక్కో కోడి గుడ్డు రూ. 6.95 పైసలతో రికార్డు స్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఫారాల వద్ద రూ. 6.95 పైసలు ఉన్న కోడి గుడ్డు ధర రిటైల్ మార్కెట్‌లో రూ. 8.50 పైసలకు పైగానే పలుకుతుంది. గతేడాది ఇదే రోజున రూ. 4.90 పైసలు ఉండగా ఇప్పుడు డబుల్ అయింది.