హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాల సందర్భంగా 16 ఏళ్ల భవాని శంకర్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం రాత్రి దున్నపోతును పట్టుకుని వేదికపైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గుండెపోటు కారణంగా మరణించినట్లు డాక్టర్లు తెలిపారని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు నారాయణగూడ సదర్ మేళా నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.